Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని ఎరువుల దుకాణాలను ఏడీ వాసు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల డీలర్లు అందరికీ ఎరువుల అమ్మకాలు అన్ని కూడా ఈ పాస్ మిషన్తోనే జరగాలని, ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు జరపాలని ఆదేశించారు.అధికధరలకు ఎరువులు విక్రయించిన వారిపై కఠినచర్యలు తీసు కుంటామన్నారు.యూరియా రూ.266.50, డీఏపీ రూ. 1200, ఎంఓపీ రూ.1700, ఎస్ఎస్పీ రూ.400గా విక్రయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పాలెం రజని, డీలర్లు పాల్గొన్నారు.