Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలు, సర్పంచుల ఆహ్వానం మేరకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన శుభసందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి విచ్చేశారు. అనంతరం ఆయన్ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముఖ్య సలహాదారుడు సుమతి పురుషోత్తం, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు రావుల రాంబాబుయాదవ్, అనుముల సర్పంచులఫోరం అధ్యక్షుడు వద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ మాలే అరుణసత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.