Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్మార్ట్ఫోన్ల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలి
అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో ఇకపై మెరుగైన సేవలు సులభతరంగా అందిస్తున్నామని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ఫోన్లు,చీరల పంపిణీ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మతో కలిసి ఆయన మాట్లాడారు.జిల్లాలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు లోప పోషణ నివారణ కోసం సరైన సమయంలో సరైన పోషణ అందించాలని, ఇకపై సులభతరం చేస్తామని వెల్లడించారు.ప్రభుత్వం మహిళ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆదిశగా ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.సంబంధిత అధికారులు, సిబ్బంది 14 రకాల రిజిస్టర్ల పాతపద్ధతిని నిలుపుదల చేసి సులభతరమైన సేవలందించాలని సూచించారు. సంబంధిత శాఖకు ఇటీవల సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లు, చీరెలను ఆయా కేంద్రాల వారీగా 1209 అంగన్వాడీ వర్కర్లకు, 48 మంది సూపర్వైజర్లకు అలాగే 1209 మంది ఆయాలు, వర్కర్లకు చీరలను పంపిణీ చేశారు.అనంతరం నూతన బాలరక్ష వాహనాన్ని ప్రారంభించారు. జిల్లాలో విపత్తులో ఉన్న పిల్లల రక్షణకు వాహన సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, మూడో ముప్పుపొంచి ఉన్నందున అన్ని పిల్లల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.