Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-చిలుకూరు
టీిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.సోమవారం మండలంలోని బేతవోలు గ్రామంలో రూ.25 లక్షల నిర్మించిన ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.టీఆర్ఎస్ అధికారం లోకొచ్చిన నాటి నుండి వైద్యం, విద్య ,తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు వంటి సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలలో అందు బాటులోకి వచ్చాయ న్నారు.అందుకే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నా రన్నారు.అనంతరం రూ.14 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణపనులను బేతవోలులో, పీఏసీఎస్ గోదాము నిర్మాణపనులను రూ.33 లక్షలతో చర్లగూడెం గ్రామంలో రైతుల సౌకర్యార్థం కోసం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య,జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీషనాగేంద్రబాబు, జిల్లా సొసైటీ డైరెక్టర్ కొండ సైదయ్య, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎస్కె.జానిమియా, సర్పంచ్ వట్టికూటి చంద్రకళనాగయ్య, ఎంపీటీసీ సైదాబాబు, వట్టికూటి ధనమూర్తి, పీఏసీఎస్ చైర్మెన్ భాష్యం సైదులు,అలసకాని జనార్దన్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ ఈదయ్య, వైద్యాధికారి ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.