Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన ఆకారపు నరేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షునిగా ఆదివారం నల్లగొండ పట్టణంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదానికి ఆకర్షితులై దశాబ్దకాలం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటమే ద్వారానే ఈ స్థాయికి ఎదిగారన్నారు.విద్యార్థుల ఉద్యమంతో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్య,వైద్యంపై లేదన్నారు.సంక్షేమరంగం అభివద్ధి బాటలో నడుపుతున్నామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు సంక్షేమహాస్టళ్ల విద్యార్థులకు ధరలకు అనుకూలంగా పెంచాల్సిన మెస్కాస్మోటిక్ చార్జీలు పెంచకపోవడంమే నిదర్శనమన్నారు.జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలపై కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై పోరుకు సిద్ధం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.