Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురావస్తు పరిశోధడు ఈమని శివనాగిరెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్
సాగర్ పరిసరాల్లోని కష్ణాతీరంలో ఆదిమానవుని అడుగుజాడలు బయటపడ్డాయని పురావస్తు పరిశోధకులు, ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో,బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధవనంలోని నదితీరం వరకు ఏర్పాటుచేసిన వాకింగ్‌ట్రాక్ (కాలిబాట)లో పత్రికా సంపాదకుల బందం పరిశీలిస్తుండగా కొత్త రాతియుగపు ఆనవాళ్ళు వెలుగు చూశాయని తెలిపారు.రాతి పనిముట్లు అరగదీసిన గుంతలు కనిపించాయని, క్రీస్తు పూర్వం నాలుగు వేల నుండి రెండు వేల ఏండ్ల మధ్య కాలానికి చెందినవని వివరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, వెలుగు పత్రిక సంపాదకులు చంద్రమౌళి, పయోనిర్ ప్రతినిధి మెల్లిమైత్రియి, బౌద్ధ నిపుణులు సంతోష్రావత్, సూదన్‌రెడ్డి, క్రాంతిబాబు,శ్యాంసుందర్‌రావు, జగదీష్, నర్సింహారావు పాల్గొన్నారు.