Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
మండలంలోని తొండ గ్రామంలో సోమవారం మహాత్మాజ్యోతిరావు ఫూలే,సావిత్రిబాయిఫూలే విగ్రహాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఎంపీపీ స్నేహలత మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుఫూలే,సావిత్రిబాయిఫూలే గొప్పమానవతావాదులన్నారు. సమాజ నిర్మాణానికి పునాదుల న్నారు.చదువుతో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసి ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చన్నారన్నారు.సామాజిక సంస్కరణఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, హంస ఫౌండేషన్ చైర్మెన్ చెరుకు సుధాకర్లక్ష్మీ, వైఎస్ఆర్టీపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి సోమన్న, వాసిరెడ్డి గోపాల్‌రెడ్డి, గొలుసుల మల్లయ్య, వార్డు సభ్యులు పాక ఉపేందర్, మహేందర్, కమిటీఅధ్యక్షుడు యల్లమలలింగన్న, పొరేళ్ళ విప్లవ కుమార్,రెడ్డిమళ్ల శ్రీనివాస్, కొండ రమేష్, పేరాల నరేష్,సంగపాక సతీష్ పాల్గొన్నారు.