Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-డిండి
దేశచరిత్రలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరు నిలిచిపోతుందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమా ర్‌రెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద విగ్రహ ప్రదాత బికుమాండ్ల రాకేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు..ప్రపంచంలో అగ్రగామిలలో ఐటీ రంగంలో భారతదేశం నిలువటం, లక్షల కోట్ల మంది భారత యువతకు ఉపాకల్పించటం రాజీవ్‌గాంధీ చోరవ అన్నారు. రాజీవ్‌గాంధీ ముందుచూపుతో, సమర్ధతలో ఈ టెక్నాలజీని భారతదేశంలోని తీసుకవచ్చారని అందువల్ల భారతదేశంలో చైనా దేశం కన్నా మిన్నగా కంప్యూటర్ టెక్నాలజీ ఉందన్నారు.స్ధానిక సంస్థలు నిర్వీర్యం కావద్దని రాజ్యాంగాన్ని సవరించి 72, 73 సవరణ తీసుకొచ్చి నేరుగా గ్రామపంచాయతీలకు నిధులు వస్తున్న వంటే అందుకు రాజీవ్‌గాంధీ కృషి మాత్రమే న్నారు.రాష్ట్రంలో జిల్లాపరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలకు నిధులివ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్సవవిగ్రహాలుగా మార్చిందన్నారు. దేశం కోసం పాటుపడిన గాంధీ, నెహ్రూ కుటుంబాల త్యాగాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్కువ చేస్తుంద న్నారు.దేవరకొండ నియోజకవర్గం ఏడేండ్లుగా అభివృద్ధిలో వెనకబడిందన్నారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి ,మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్లవెల్లిరాజేష్రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, రుక్మారెడ్డి, వేణుధర్‌రెడ్డి, వెంకటే శ్వర్రావు, సిరాజ్‌ఖాన్, శంకర్‌నాయక్, కిషన్ నాయక్, రేణుక, ధనమ్మ మల్లేష్‌నాయక్, సతీష్ నాయక్, పున్నా దినేష్, పోషాలు పాల్గొన్నారు.