Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ.రమణకు నల్లగొండ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జగ్జీవన్‌కుమార్, కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి పుష్పగుచ్ఛాలు అందచేసి ఘనస్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పోలీసుల గౌరవవందనాన్ని ఆయన స్వీకరించారు.సోమవారం విజయవాడ పర్యటన ముగిం చుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు కుటుంబసమేతంగా వెళుతూ సూర్యాపేట సెవెన్ హోటల్ నందు జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు.ఈ సందర్బంగా సూర్యాపేట అడిషనల్ జిల్లా జడ్జి వసంతకుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, అడిషనల్ జూనియర్ జడ్జి ప్రశాంతి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు,డీఎస్పీ మోహన్‌కుమార్,ఆర్డీఓ రాజేంద్రకుమార్, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.