Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-నూతనకల్
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేయడం తగదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని తోట్ల మల్సూర్ స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.యాసంగిసీజన్లో రైతులకు వరికి బదులు ప్రత్యామ్నాయం ఏ పంటలు వేయాలో నిర్ణయించి వేసే ప్రతిపంటకు ముందే ప్రభుత్వం మద్దతుధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతుధరతో పాటు కేరళ వామపక్ష ప్రభుత్వం లాగా ప్రతిపంటకు మద్దతుధరకు అదనంగా బోనస్‌ను చెల్లించాలని కోరారు.రూ.లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన కాలేశ్వరంతో కోటి ఎకరాలను మాగాణి చేస్తానన్న కేసీఆర్ వడ్లు కొనకుంటే రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు.ఎస్సారెస్పీ ద్వారా నీరు వస్తున్న సందర్భంలో మెట్టసాగుకు బదులు రైతులందరూ వరి కోసం పొలాలు చేశారన్నారు.వరిని సాగు చేయొద్దంటే ఎలా అని ప్రశ్నించారు.ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మిర్చి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతుబంధు కాకుండా రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర చెల్లిస్తే వ్యవసాయం చేసే ప్రతిరైతు లబ్ది పొందు తారన్నారు.మండలపరిధిలోని అన్ని గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగు తున్నాయని, వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీసభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, బుర్ర శ్రీనివాస్, కందాలశంకర్రెడ్డి,పులుసు సత్తయ్య, మండల నాయకులు కల్లెపల్లి భాస్కర్, పులుసు ప్రహ్లాద, యాదగిరి, యాకయ్య, రామ్మూర్తి పాల్గొన్నారు.