Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరావత్ వీరన్ననాయక్
నవతెలంగాణ-చివ్వెంల
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరావత్ వీరన్ననాయక్ హెచ్చరించారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు రైతులతో రచ్చబండ కార్యక్ర మంలో భాగంగా ఎర్రవెల్లి బయల్దేరిన కాంగ్రెస్ నాయకులను సోమవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మండల యూత్ ప్రెసిడెంట్ సమీర్, ధరావత్ సైదానాయక్ ఏఐయూ డబ్య్లూసీ జిల్లా డిప్యూటీ కోఆర్డినేటర్ ధరావత్ వీరన్ననాయక్,కృష్ణానాయక్, ధరావత్ రమేష్‌నాయక్, కృష్ణానాయక్, సురేష్‌నాయక్, నాగరాజులను అరెస్టు చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ధరావత్ వీరన్ననాయక్ మాట్లాడుతూ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేవని, రానున్న రోజుల్లో కెేసీఆర్ అవినీతి,అసమర్థ పాలనకు చరమగీతం పాడడం ఖాయమన్నారు.పార్టీ ఆధ్వర్యంలో నిత్యం ప్రజాసమస్యల పట్ల పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.