Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి రామసముద్రం బైపాస్ రోడ్లో జిందాషా మదార్ సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబైంది.అందులో భాగంగా ఈ నెల 31న మధ్యాహ్నం 1.30 గంటల నుండి దర్గా సంరక్షకులు అయిన బీజని.మధుకుమార్ ఇంటి దగ్గర నుండి రామసముద్రం బైపాస్ రోడ్ లో గల జిందా షా మదార్ దర్గా వద్దకు గంధం ఊరేగింపు చేయనున్నట్టు ఉర్సు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.భక్తులకు మధ్యాన్నం ఒంటి గంట నుండి అన్నదాన ఉందని, భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.