Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ అభివద్ధికి దివీస్ అందిస్తున్న కషి ఎంతో అభినందనీయమని మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డులో ఉన్న నాగులకుంటచెరువు అభివద్ధి, సుందరీకరణకు రూ.కోటీ 30 లక్షలు, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం పై అంతస్తు నిర్మాణం కోసం రూ.కోటీ 30 లక్షల వ్యయంతో దివీస్ లాబోరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిర్మాణ పనులకు ఆయనతోపాటు దివీస్ పరిశ్రమ జీఎం పెండ్యాల సుధాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణ, విద్య అభివద్ధికి దివీస్ పరిశ్రమ సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు గోపగోని లక్ష్మణ్, కొయ్యడ సైదులుగౌడ్, బండమీది మల్లేశం, సందగల్ల విజయసతీశ్గౌడ్, ఉబ్బు వరమ్మవెంకటయ్య, కాసర్ల మంజులశ్రీనివాస్రెడ్డి, ఆలె నాగరాజు, కోరగోని లింగస్వామి, ఎమ్‌డి.బాబాషరీఫ్, కామిశెట్టి శైలజ, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.