Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీ(ఐ)ఎం ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
సీపీ(ఐ)ఎం రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం ఆపార్టీ నాయకులు మండలంలోని ఆల్లందేవి చెరువు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజా ఉద్యమాలలో ముందుండి పోరాడుతున్న సిపి(ఐ)ఎం ను ప్రజలు ఆదరించాలని అభిమానించాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నారు.సిబిఐచ ఈడి వంటి సంస్థలను తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు.రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నిధులు నీళ్లు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల ఆశలను వమ్ము చేస్తుందన్నారు.పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ఐక్యంగా ఖండించాల న్నారు. అందుకు సీపీ(ఐ)ఎం చేపట్టే ప్రజా ఉద్యమాలలో అత్యధిక మంది భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుండు జంగయ్య, దోనూరు నిర్మల, గంగ దేవీ నరసింహ,గంగాదేవి బిక్షపతి,గుండు లింగస్వామి, ఉప్పలపల్లి బాలకష్ణ, శిరగోని మారయ్యా,యాదయ్య, వెంకటయ్య, గుండు దశరథ, బద్దం బాల్రెడ్డ్డి, గుండు ధనుష్ గుండు నరసింహ, ధనలక్ష్మి రామానుజయ తదితరులు పాల్గొన్నారు.