Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 255 (ఎర్రమట్టి బోర్డు) భూముల సమస్యలు యేండ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కబ్జాలో ఉండి సాగుచేసుకుంటున్న రైతులకు రైతు బంధు రైతు బీమా వంటి పథకాలు వర్తించడం లేదు.రైతు మతి చెందితే వారి వారసులకు పౌతీ కాని పరిస్థితి నెలకొంది.ఇటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొన్నేళ్లుగా రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడంతో రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకున్నారు.ఆయినా రెండేళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు పలుమార్లు జిల్లా కలెక్టర్,చౌటుప్పల్ ఆర్డిఓ కు విన్నవించుకున్నారు.కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వి.బ్రహ్మయ్య అర్ఐ, సర్వేయర్లను సమాయత్తం చేస్తూ సర్వే పనులు చేయిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం కషి చేస్తున్నారు.
మండల కేంద్రంలో(ఎర్ర మట్టి గుట్ట)255 సర్వే నెంబర్లు 144.15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 2.24 ఎకరాల్లో భవనాలు, కాలువలు, స్మశానాలు వంటి వాటికి కేటాయించారు.ప్రస్తుతం ఈ సర్వీనెంబర్లో 105 మంది రైతులు 147.01 ఎకరాల్లో పట్టాలు పొంది ఉన్నారు.గతంలో ఇక్కడ పని చేసిన అదికారులు సర్వే నంబర్ లో ఉండాల్సిన భూమి కంటే 5.14 ఎకరాలకు అదనంగా ఇస్టానుసారంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు.మొట్ట మొదటిసారి 39 మంది రైతులకు 57.25ఎకరాలు పట్టాలు ఇచ్చారు. వీళ్లంతా తమ భూమినీ సాగు చేసుకుంటు వస్తన్నారు. రైతులకు ఉండాల్సిన భూమికంటే కొంతమంది అదనంగా కబ్జాకలిగి ఉన్నారు.మరికొంతమంది ఉండాల్సిన భూమి కంటే తక్కువ కబ్జా కలిగి ఉన్నారు.కొంతమంది సర్టిఫికెట్లు కలిగి కబ్జాలో లేకుండా పొజిషన్ కోసం ఎదురు చూస్తున్నారు.2000 సంవత్సరంలో అప్పటి అధికారులుమారో 76 మంది రైతుల కు 47 ఎకరాలకు పట్టా సర్టిఫికెట్ లు ఇచ్చారు. పాసుబుక్కులు, సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులు.పోజిషన్ చూపించక పోవడంతో రైతుల మద్యన వివాదాలు తలెత్తాయి. ఇదిలా ఉండగా మరో 6 మంది రైతులు తమపట్టాలు తిరిగి సరెండర్ చేయడంతో 11 ఎకరాలు వ్యవసాయం మార్కెట్ యార్డ్ కని ఇచ్చారు.ఇప్పటికే మూడు నాలుగు సార్లు సర్వేలు చేశారే తప్ప పరిష్కారం చేయడం లేదని రైతులు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
అందరికి న్యాయం జరిగేలా చూస్తా- తహసిల్దార్ వి. బ్రహ్మయ్య
255 సర్వే నెంబర్లు పట్టాలు, పాసుపుస్తకాలు కలిగివున్న రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తాను. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ఎట్లాంటి సబ్ డివిజన్ చేయకుండా సర్టిఫికెట్లు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇచ్చిన వెంటనే పొజిషన్ చూపించాల్సి ఉంది. పొజిషన్ చూపించక పోవడంతో రైతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. రైతులు ఇష్టానుసారంగా కబ్జాలు చేశారు.రైతులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. రైతులందరూ సహకరిస్తే రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తాను.