Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నేటి నుండి రిలే దీక్షలు
అ సీిఎం హమీ నెరవేర్చక పోతే ఆమరణ దీక్షలకు సిద్ధం
అ వర్తక సంఘం సభ్యుల హెచ్చరిక
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదాద్రి దేవస్థానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అభివద్ధి చేస్తానని ప్రకటిస్తే ఎటువంటి షరతులు లేకుండా సహకరించామని,కొండపైన తమకు దుకాణాలు కేటాయిస్తామని చెప్పి ప్రస్తుతం ఎలాంటి దుకాణాలు కొండపైన ఏర్పాటు చేయడం లేదని ప్రకటిస్తూ,తమను రోడ్డున పడేస్తారా..అని కొండపైన లక్ష్మీ నరసింహ స్వామి వర్తక సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుట్టలో సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం బాధ్యులు, సభ్యులు మాట్లాడుతూ కొండపైన 111 దుకాణాలు ఆరేండ్లుగా ఉమ్మడిగా ఆలయ అభివద్ధికి సహకరించు కుంటూ కొన్ని దుకాణాలు నడుపుకుంటూ మొత్తం దుకాణాల కిరాయి దేవస్థానంకు చెల్లిస్తూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు.ఆలయ పునర్నిర్మాణం జరిగే ముందు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటుచేసిన సమావేశంలో 111 దుకాణాలు తొలగించి దేవాలయం పునర్ నిర్మాణం పూర్తయిన తర్వాత వాటిని నిర్మించి దుకాణాలు కొనసాగిస్తున్న వారికే కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. కొండపైన ఎక్కడ దుకాణాలు నిర్మించేది కూడా పవర్ ప్రజెంటేషన్ ద్వారా తమకు చూపించారని తెలిపారు .ప్రస్తుతం కొండపైన ఆలయ అభివద్ధి పనులు పూర్తి కావస్తున్నా సమయంలో ప్లాన్ లో దుకాణాలు లేవని అధికారులు తెలియజేయడం తమకు ఆందోళన గురి చేసిందన్నారు. ఆరేండ్ల నుండి ఆలయ అధికారులు చెప్పిన విధంగా వర్తక సంఘం ,వ్యాపారస్తులు ఆలయ అభివద్ధికి సహకరించిన మీకు దుకాణాలు కేటాయిస్తామని చెప్పి, కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించడం అన్యాయమన్నారు.ఆలయ అభివద్ధికి సహకరించి పాపానికి 500 కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హమిని నిలబెట్టుకోవాలని నెటి నుండి రిలే దీక్షలు చేపడతామన్నారు .కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడబోమని సభ్యులు హెచ్చరించారు .ఈ సమావేశంలో వర్తక సంఘం అధ్యక్షులు కర్రె వెంకటయ్య ,ప్రధాన కార్యదర్శి తడాఖా వెంకటేష్,మాజీ అధ్యక్షులు కొన్నే రమేష్ ,సభ్యులు కీసర బాలరాజు,దామోదర్ ,కిషోర్ ,మోహన్,సుగుణమ్మ ,ఇందిరా ,కిట్టు ,ఆరె శ్రీధర్ ,కర్రే వీరయ్య తో పాటు లక్ష్మీ నరసింహ స్వామి వర్తక వెల్ఫేర్ సంఘం చెందిన 200 మంది సభ్యులు హాజరయ్యారు.