Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ -వలిగొండ
వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం మండలంలోని సంఘం గ్రామంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్పీఆర్డీ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్ణయించిందన్నారు. వికలాంగుల పరిరక్షణ చట్టం 2016 సంబంధించిన విధి విధానాలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సీడీపీఓ శైలజ ,ఆ సంఘం జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్, నల్లగొండ జెడ్పీటీసీ అనంత రెడ్డి వైస్ ఎంపీపీ బాత రాజు ఉమా బాలరాజు, ఆ సంఘం గౌరవ అధ్యక్షులు మాటూరి బాలరాజు ,తదితరులు పాల్గొన్నారు .