Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్లో డిగ్రీ కళాశాల హామీని నిలబెట్టుకోకపోవడం, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం సీఎం కేసీఆర్ నైజం అని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకష్ణ అన్నారు. మంగళవారం చౌటుప్పల్లోని కోర్టుకు హాజరైన సందర్భంగా మధుకష్ణ మాట్లాడారు. 2016లో చౌటుప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం సీఎం కాన్వారును అడ్డగించిన కేసులో భాగంగా చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు హాజరైనట్టు తెలిపారు. నేటికీ చౌటుప్పల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, చౌటుప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని డిమాండ్చేశారు. కోర్టుకు హాజరైన వారిలో పల్లె శివకుమార్, ఆవుల శివాజీ, చీమకండ్ల మధు, గుడ్డేటి జ్యోతిబసు, రత్నం శ్రీకాంత్, బొమ్మకంటి వినోద్, మాడగోని కిరణ్, పబ్బు నవీన్, నత్తి నరేశ్, కూనూరు గణేశ్, చిన్నం సాయి, నితిన్, మధు, అమరేందర్, దయాకర్, నరేశ్, వంశీ, వేణు పాల్గొన్నారు.