Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ఇండియన్ మెడికేల్ అసోసియేషన్, నీలగిరి, నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ ఎస్పీగా సేవలు అందించిన ఏవి .రంగనాథ్ హైదరాబాద్ ట్రాఫిక్ కు బదిలైన సందర్భంగా ఐఎంఏ నీలగిరి సభ్యులు ఘనంగా మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ మూర్తి మాట్లాడుతూ కొద్దీ నెలల క్రితం వారు డీఐజీగా పదోన్నతి పొంది నల్లగొండ లోనే ఉండి విధులు నిర్వర్తించారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి నందు రంగనాథ్ ఎంతో సహకరించారని కొనియాడారు. నూతనంగా నల్లగొండ ఎస్పీ గా భాద్యతలు తీసుకున్న రమా రాజేశ్వరికి ఐఎంఏ ఆత్మీయ స్వాగతం పలికింది. ఏ ఎస్ పి నర్మద ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు డాక్టర్ పుల్లారావు,డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి, నీలగిరి కార్యదర్శి అనిత రాణి, ఉపాధ్యక్షుడు డాక్టర్ కామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.