Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
మునిపంపులలో చేనేత మగ్గాల పరిశీలన
నవతెలంగాణ -రామన్నపేట
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 12శాతం జీఎస్టీ విధించి చేనేత కార్మికుల జీవితాలతో ఆటలాడుతూ వారిని రోడ్డున పడేసిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్సిం చారు. మండలంలోని మునిపంపుల గ్రామంలో ఆ పార్టీ ఆద్వర్యంలో మంగళవారం చేనేత కార్మిక కుటుంబాలను పరామర్శాంచి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చేనేత ఉపాధి క్షీణించి వత్తి దెబ్బతినడంతో కార్మికులు వలసలు పోయి కడు పేదరికంలో మగ్గుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారీ వస్త్రాలపై వస్తు సేవల పన్ను ఏకంగా 12 శాతం పెంచిందన్నారు. దీంతో నేతన్నల బతుకు దుర్భరంగా మారుతుందని విమర్శించారు. ఒక రోజు మొత్తం కుటుంబ సభ్యులందరూ కష్టపడి పని చేసినా రోజుకు రూ.300 కూలి గిట్టడం లేదన్నారు. ఇప్పటికే ఇల్లు గడవక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బిజేపి అధికారం చేపట్టాక కార్పోరేట్లు, పెట్టుబడిదారులకు తివాచీలు పరుస్తూ వత్తిదారులపై కపట ప్రేమ చూపుతుందన్నారు. వెంటనే పెంచిన జీఎస్టీని తగ్గించి, చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని లేనియెడల మహా పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీసభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, గ్రామ సర్పంచ్ యాదాసు కవితయాదయ్య, శాఖ కార్యదర్శి తొలుపునూరి శ్రీనివాస్, నాయకులు గునుగుంట్ల సత్తయ్య, గంటెపాక శివ కుమార్, జంపాల ఉమాపతి, అప్పం సురేందర్, ఉండ్రాతి నర్సింహ్మ, ఉయ్యాల రవి, మేడి భాషయ్య, మధు పాల్గొన్నారు.