Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోతె :ఎస్సారెస్పీ నీటిని వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మట్టి పెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని ఇవాళపురం గ్రామంలో మైనంపాటి వెంకట రెడ్డి అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఆర్ ఎస్ పి కాలువ ప్రవహించే ఏరియాలో రైతు లు నార్లు పోసుకొని నాట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పంటలు సాగు చేసుకోవటానికి నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సారెస్పీ ద్వారా నీటిని విడుదల చేయాలని లేనియెడల తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఉద్యమాన్ని నడుపుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి ము లు కూరి గోపాల్ రెడ్డి నా గా ము మల్లయ్య, సోమ గాని మల్లయ్య, కే సత్యనారాయణ, కొండ రాములు,చర్లపల్లిమల్లయ్య, పోతయ్య, బానోతులచ్చిరాం,అలివేల పాల్గొన్నారు.