Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్‌పల్లి : దేశప్రధాని నరేంద్రమోదీ,భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడులచే ప్రశంసలు పొందిన,కవి,సాహితీవేత్త, కూరెళ్ల గ్రంథాలయ, వ్యవస్థాపకులు దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠా లచార్యకు జనవరి2న నార్కట్‌పల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహించే అభినందన ఆత్మీయసన్మానసభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం మండలకేంద్రంలో కరపత్రాలను విడు దల చేశారు.ఈ అభినందన సభకు ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతసంఘం అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్ మోహన్, నాయకులు, లాలుకోట వెంక టాచారి,చోల్లేటి కష్ణామాచారి, జిల్లా నాయకులు కాసోజువిశ్వనాధం, రాచకొండ గిరి పాల్గొననున్నారని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు పెందోట సోమయ్య పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేవాలయ ధరకర్తలు, దాసోజు గ్యాణేశ్వర్,చోల్లేటి శ్రీనివాస్, గుంటోజు రమేష్, గడగోజు సత్యనారాయణ, చొక్కళ్ళ పుష్పగిరి, స్థానిక స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఆందోజు మహేందర్,కార్యదర్శి పిన్నోజు ఉపేంద్రాచారి పాల్గొన్నారు.