Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
అక్రమఅరెస్టులు అప్రజాస్వామికమని యూటీఎఫ్ డివిజన్ నాయకులు ఆర్.ధనమూర్తి అన్నారు.మంగళవారం జిఓ 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి పిలుపు మేరకు సెక్రెటరియేట్‌కు తరలివెళ్తున్న యూటీఎఫ్ డివిజన్ నాయకులుధనమూర్తి, పి.శ్రీని వాస్‌రెడ్డి, ఎన్.నాగేశ్వరరావు, టిఏ.జనార్దన్, మొటిలాల్ తది తరులను అరెస్టు చేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా విషయం తెలుసుకున్న పలు మండలాల బాధ్యులు పోలీస ్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ధనమూర్తి మాట్లాడుతూ జీఓ 317 వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారన్నారు. భార్యాభర్తలు, సీనియారిటీపై అప్పీల్స్ సత్వరమే పరిష్కరించాలన్నారు.పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.స్కూల్ అసిస్టెంట్ పోస్టును జోనల్ క్యాడర్‌గా మార్చాలన్నారు.పాఠశాలల కేటాయింపు అడహక్ పద్ధతిలో చేసి సాధారణ బదిలీల్లో అందరికీ అవకాశం ఇవ్వాలని కోరారు.ఉపాధ్యాయుల కేటాయింపులో స్థానికతను విస్మరించి వేలాది మంది ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాల నుండి బలవంతంగా వేరే జిల్లాలకు కేటాయించడాన్ని ఖండిస్తు న్నామన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ, మునగాల, అనంతగిరి, మేళ్లచెర్వు, చిలుకూరు మండలాల బాధ్యులు మండవఉపేందర్, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు పాల్గొన్నారు.