Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫైరవీలకు పదును పెట్టిన ఆశావహులు
జనరల్ సీటుతో పెరుగుతున్న ఆశావహుల లిస్టు
కొత్త పాలకవర్గంపై ఉత్కంఠ
నవతెలంగాణ-నిడమనూరు
నిన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల మూడ్లో ఉన్న టిఆర్ఎస్ నేతల దష్టి ఇప్పుడు మార్కెట్ చైర్మన్ పదవి వైపు మళ్లింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం లో పెద్దవూర, హాలియ నిడమనూరు వ్యవసాయ మార్కెట్ లు ఉన్నాయి. అయితే నియోజకవర్గం లో మొత్తం 6మండలాలు ఉండగా త్రిపురారం, నిడమనూరు మండలాల పరిధిలో నిడమనూరు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ఎన్నుకుంటుంది. అయితే ఇప్పటివరకు మార్కెట్ చైర్మన్ పదవిని త్రిపురారం మండల వ్యక్తి కామర్ల జానయ్య ఎస్సి రిజర్వ్డ్ కోటాలో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈనెల 12తో పాత పాలకవర్గం గడువు ముగియడం తో ఆశావాహులు తమ పైరవీలకు పదును పెడుతున్నారు. మార్కెట్ కమిటీ పదవులకు నోటిఫికేషన్ రానప్పటికి రెండు మండలాలకు చెందిన నేతలు చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఆశావహులు ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు నోముల భగత్ లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
రొటేషన్ పద్ధతిలో చైర్మెన్ల బాధ్యతలు
నిడమనూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న త్రిపురారం, నిడమనూరు మండలాల పరిధిలో రొటేషన్ పద్ధతి కొనసాగుతుంది. ఒకసారి త్రిపురారం మండలం నుండి మరొకసారి నిడమనూరు నుండి చైర్మన్ పదవిని దక్కించు కుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2017నుండి 2019వరకు నిడమనూరు మండలం లోని వెనిగండ్ల గ్రామానికి చెందిన కొప్పోలు అనసూర్య(జనరల్ మహిళ) ప్రాతినిధ్యం వహించగా అనంతరం త్రిపురారం మండలానికి చెందిన కామర్ల జానయ్య(ఎస్సి జనరల్)చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. కాగా ఇప్పుడు అదే ఆనవాయితీ కొనసాగుతుందని త్రిపురారం మండలానికి చెందిన నేతలకు అవకాశం ఉండబోదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో నిడమనూరు నుండి ఆశావాహులు తమ రాజకీయ గురువుల వద్దకు, మంత్రి ఎమ్మెల్యే ల వద్దకు బారులు తీరుతున్నారు.ఇప్పుడు మార్కెట్ చైర్మన్ పదవి జనరల్ స్థానం అవుతుందన్న ఆశతో ఆపార్టీ నేతలు ఎవరి పైరవీల్లో వారు మునిగిపోయారు. ప్రదానంగా ఇప్పుడు కొంత మంది పేర్లు మండలంలో వినబడుతున్నాయి. ముకుందాపురం నుండి రాం అంజయ్య యాదవ్, నూకల వెంకటరెడ్డి , రాజన్నగూడెం నుండి మండలి సునీత, శాఖపురం నుండి మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావ,ు చేకూరి సూరయ్య, నిడమనూరుకు చెందిన బొల్లం సైదులు, మలిదశ ఉద్యమ కారుల నుండి పగిల్లా సైదులు, తాటి సత్యపాల్, నారమ్మగూడెం నుండి రైతు సంఘం మండల అధ్యక్షుడు బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి పేర్లు అదిష్టానం పరిశీలన లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాక కొత్త పాలకవర్గం మార్కెట్ చైర్మన్ పదవీ ఎవరికి దక్కుతుందో అని ఉత్కంఠ నెలకొంది.