Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రైతుబంధు పథకం నిరుపేద రైతులకు వరం లాంటిదని రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కష్టాలు తెలిసిన రైతు బంధావుడని, రైతుల మోకాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్ ఆడెపు బాలస్వామి , మండల, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ , పుట్ట మల్లేష్ ,పట్టణ సెక్రటరీ జనరల్ కుండే సంపత్, మాజీ పట్టణ అధ్యక్షుడు మోరిగాడి వెంకటేష్ కౌన్సిలర్, బేతి రాములు,సర్పంచ్లు, ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి, వంగల శ్రీశైలం, వడ్ల, నవ్య శోభన్ బాబు,మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు మామిడాల భానుచందర్,నాయకులు వస్పరి బాలయ్య, వసుపరి బాలస్వామి, బింగి రవి,జనగామ వెంకటపాపిరెడ్డి, జంగ స్వామి,సుంచు మహేందర్,తమ్మలి ఆశయ్య,కుతాటి అంజన్,సురేష్,తదితరులు పాల్గొన్నారు.