Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జనవరి నుండి ఆపరేషన్ స్మైల్
అ అదనపు ఎస్పీ నర్మద
నవతెలంగాణ- నల్లగొండ
ఆపరేషన్ స్మైల్ - 8ను విజయవంతం చేయడం కోసం అన్ని శాఖల సమన్వయంతో పని చేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మిక శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కషి చేయాలని అధికారులకు సూచించారు. బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం ద్వారా బాల కార్మికులకు విముక్తి కల్పించేలా ఆపరేషన్ స్మైల్ బందాలు పని చేయాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2015 సంవత్సరం నుండి 2021 వరకు 15 విడతలుగా జనవరి, జులై నెలలో నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక షబ్ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుల్స్‌ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్‌తో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తతంగా తనిఖీలు నిర్వహించనున్నామని వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బాలలను పనిలో పెట్టుకున్న వారికి 25,000 జరిమానా విధించవచ్చన్నారు. బాలలంతా చదువుకున్నప్పుడే దేశం అభివద్ది చెందుతుందని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థ నిర్ములన లక్ధ్యంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.ఈ సమావేశంలో సిఐ సురేష్, బాలల పరిరక్షణ అధికారి గణేష్, ఎస్ఐలు రాంబాబు, శంకరయ్య, రామకష్ణ, నందూలాల్, జిల్లా సంక్షేమ అధికారి సుభద్ర, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు భాస్కర్, లక్ష్మీ కిరణ్, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ సబ్ డివిజన్ల ఆపరేషన్ స్మైల్ బందాలసభ్యులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.