Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
జిల్లాకేంద్రంలోని సింగన్నగూడెం చౌరస్తా బైపాస్ రోడ్డు పక్కన నిర్మిస్తున్న అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, దళిత సంఘాల నాయకులు నాగారం అంజయ్య, బర్రె సుదర్శన్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ,బండారు రవివర్ధన్, కంచనపల్లి నరసింహారావు పరిశీలిచారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు మాట్లాడుతూ 2017 లో ప్రభుత్వం మంజూరు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడిటోరియంను నిర్లక్ష్యం చేస్తూ దళిత ,బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. రెండుసార్లు ప్రభుత్వం చేతిలో పెట్టుకుని ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భవనాన్ని నిర్మించకుండా బలహీనవర్గాలు, దళితుల పైన కపట ప్రేమ తెలుస్తుందన్నారు. వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల రూపాయలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తనవంతుగా ఎంపీల్యాండ్స్ కింద రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. జయంతి ఏప్రిల్ 14 వరకు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు నాగారం అంజయ్య, బర్రె సుదర్శన్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ,ఇటికల దేవేందర్, కంచన పల్లి నర్సింగ్ రావు,బానోత్ భాస్కర్ నాయక్, గ్యాస్ చిన్న, అందే నరేష్,దర్లాయి దేవేందర్, శివ శంకర్, టిల్లు తదితరులు పాల్గొన్నారు.