Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని వీరవెల్లి గ్రామ సభ్యుడు రేగు.వెంకయ్య, చీమల కొండూర్ గ్రామ రైతు సభ్యురాలు చిన్నం.బుఛ్చమ్మ, బండసోమారం గ్రామ సభ్యురాలు నల్లమాసు. బాలమ్మ, రామచంద్రాపురం గ్రామానికి చెందిన కొండోజు ఆంజనేయులు అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాలకు గురువారం రూ.30వేల చొప్పున సంఘం సభ్యుల డివిడెండ్ నిధి నుండి అధ్యక్షులు మందడిలక్ష్మీ నర్సింహ్మ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎలిమినేటి మల్లారెడ్డి , సంఘం ఇన్చార్జి సీఈఓ శ్రీ నల్లమాస.రాములు, డైరెక్టర్లు బల్గూరి మధుసూధన్ రెడ్డి, సుబ్బురు. మహేందర్, పల్లెర్ల స్వామి, అంగడి బాలమ్మ, గంధమల్ల.వెంకటేశ్వర్లు ,తదితరులు పాల్గొన్నారు.