Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ బెల్లి యాదయ్య
అ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశంగా తీసుకురావాలి
అ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు
నవతెలంగాణ -రామన్నపేట
భుమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖీంచబడిన మట్టి మనుషులు మహా పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటమని స్థానిక ప్రభత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, కవి, రచయిత డాక్టర్ బెల్లి యాదయ్య అన్నారు. ఎస్ఎఫ్ఐ 52వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా గురువారం అం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వీర తెలంగాణ వీధి నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటీ వీరోచిత పోరాటాన్ని వీధి నాటకం రూపంలో కండ్లకు కట్టినట్టు చూపించారని అభినందనీయమన్నారు. విద్యార్థులు నాటి చరిత్రను తెలుసుకోకపోతే మన అస్థీత్వాన్ని మనం కోల్పోయినట్టే, ముందు తరాలవారు చేసిందంతా పోరాటమే అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు మాట్లాడుతూ రైతాంగ పోరాట స్పూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. మహోజ్వలంగా జరిగిన పోరాటం నేటి విద్యార్థులకు తెలిసేలా ప్రభుత్వాలు పాఠ్యాంశంగా చర్చి బోధించాలని కోరారు. నాటకానికి ప్రారంభ సూచికంగా స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాల జెండాను ఆవిష్కరించారు. ప్రజా నాట్యమండలి జిల్లా కళాకారుల వీర తెలంగాణ వీధి నాటకం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. నాయకులు మేకల జలందర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీి నాగటి ఉపేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా అద్యక్షులు వనం రాజు, మండల కార్యదర్శి బండ్ల పవణ్, గర్ల్స్ కన్వినర్ మౌనిక, ఆవనగంటి హరీష్, ప్రజానాట్యమండలి జిల్లా అద్యక్ష, కార్యదర్శులు గంటెపాక శివ కుమార్, దేశపాక రవి, కందుల హనుమంతు, పొట్లచెర్వు గాయత్రి, గన్నెబోయిన ఆదిత్య, బత్తిని సందీప్, మహేష్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారంలోని మోడల్ స్కూల్లో ఎస్ఎఫ్ఐ జెండాను సంఘం మండల అధ్యక్షులు బర్రె రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రధానకార్యదర్శి పల్లె శివకుమార్ మాట్లాడారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చందు, నవీన్, మహేశ్, మనోజ్, మధు, ప్రకాశ్ పాల్గొన్నారు.