Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఇందిరమ్మకాలనీ మొదటి విడతలో ఇటీవలే జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్తీపై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో 8వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కాలనీ మొదటి,రెండు, మూడు విడతలతో పాటు కుసుమవారిగూడెం, నల్లచెరువుతండా ప్రజలకు ఉచితంగా హెల్త్క్యాంపును నిర్వహించారు. కార్యక్రమానికి పట్టణ సీఐ ఆంజనేయులు, హెల్తీఫై మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మతకాల చలపతిరావులు ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈకార్యక్రమంలో సుమారు 250 మందికి పైగా చికిత్స అందించినట్టు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇలాంటి హెల్త్క్యాంపులు నిర్వహి ంచడం వల్ల పేదలకు ఎంతోమేలు జరుగు తుందన్నారు.ఈ కార్యక్ర మంలో అర్ఎంపీ గంగుల రవి, ప్రముఖ ఇంగ్లీష్ లెక్చర్ ఎస్కె. సత్తార్,కడారిసతీష్, కత్తివెంకన్న, మామిడాలచంటి, రమేష్, శ్రీకాంత్, సాయి పాల్గొన్నారు.