Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతగిరి :గ్రామ అభివద్ధికి అడ్డుకట్ట వేసేందుకు సర్పంచ్,కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని ఉపసర్పంచ్ భూక్యా నాగరాజు ఆరోపించారు.మండలపరిధిలోని వసంతపురం గ్రామంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ సమావేశానికి సంబంధించి అభివద్ధి పనులలో భాగంగా ప్రత్యక్షంగా లేక పోయినప్పటికీ, ఉన్నట్లుగా మినిట్స్ బుక్‌లో నమోదు చేస్తున్నట్లు ఆరోపించారు.పాలకవర్గం ప్రమేయం లేకుండా సర్వసభ్య సమావేశంలో హాజరు కానీ వార్డు సభ్యుల నుండి రహస్యంగా సంతకాల సేకరణ చేసి తప్పుడు తీర్మానాలతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఉపసర్పంచుల హోదాను గుర్తించి చెక్‌పవర్ ఇస్తే స్థానిక కార్యదర్శి అందుకు భిన్నంగా వ్యహరిస్తూ కులవివక్ష చూపుతోందన్నారు.గ్రామ సమస్యలపై పంచాయతీ కార్యాలయంలో ప్రశ్నిస్తుంటే కులాన్ని కించపరిచే విధంగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మల్టీ పర్పస్ వర్కర్లో కూడా ఒకరికి బదులు మరొకరు పని చేస్తున్నారని, కనీసం తీర్మానం లేకుండా ఎలా ఒకరి కింద మరొకర్ని నియమిస్తారని ప్రశ్నించారు.