Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలగిరిరూరల్:మున్సిపాలిటీపరిధిలో 20 ఏండ్లుగా వైద్యవత్తిలో ఉండి వైద్యాన్ని అందిస్తూ ప్రజల ప్రశంసలందుకుంటున్న డాక్టర్ రామచంద్రన్గౌడ్ అనతికాలంలోనే మండలంలో గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడిగా ఎంపికై సేవలందిస్తూ కొద్దిరోజుల్లోనే మండలంలోని లయన క్లబ్ ఆధ్వర్యంలో కోశాధికారిగా ఎన్నికై ప్రజాసేవలో నిరు పేదలకు, పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, దుప్పట్లు, విద్యార్థులకు నోట్‌బుక్స్, మాస్క్‌లు, శానిటైజర్ పంపిణీ కార్యక్రమాల్లో సేవ చేస్తూ వారి మనస్సుల్లో చెరని ముద్ర వేసుకున్నారు. మండల కేంద్రంలో సామాన్య ఆర్ఎంపీగా 20 ఏండ్లుగా ఎందరికో వైద్య సేవలు అందిస్తూ ఈరోజు మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శిగా ఎన్నికై ప్రజాసేవలో మూడు రకాలుగా తనవంతు పాత్రను పోషిస్తున్నారు.