Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గోపినాథ్
నార్కట్‌పల్లి :అందరికీ విద్యను అందించడమే ఎస్ఎఫ్ఐ లక్ష్యం అని ఆ సంఘం నకిరేకల్ డివిజన్ కార్యదర్శి అమనగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాల ఆవరణలో ఆయన ఆ జెండాను ఆవిష్కరించారు. ముందుగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూల మాలలేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970లో కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ నాటి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా ఉందన్నారు. 52 వసంతాల ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో అనేకమంది విద్యార్ధులు అమరవీరులయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జోగు నాగరాజు, దండు వంశీ, మచ్చ గిరి, వంశీ, చింటూ, లోకేష్, అఖిల్, ప్రసాద్, బన్నీ శివ, సంతోష్, మహేష్ , నవీన్, అరవింద్, గిరి పాల్గొన్నారు.