Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారుల తీరుపై మండిపాటు
నవతెలంగాణ-సూర్యాపేట
మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధికారులను నిలదీశారు.పట్టణంలో మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని, నెలకు నాలుగైదు రోజుల పాటు వివిధ కారణాలతో మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నారని ప్రశ్నించారు. పట్టణంలో పలు వార్డులలో వీధికుక్కల సమస్య అధికంగా ఉందన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని, డాగ్కార్నర్ నిర్మాణం త్వరగా చేయాలని తెలిపారు.పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని, దోమల సమస్య నివారణకు డ్రెయినేజీలు శుభ్రం చేయాల న్నారు.దోమల మందు ఫాగింగ్ చేయాలని చెప్పారు. మున్సిపాలిటీ విలీన గ్రామాలలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లుగా నిరంతరం పాలక మండలిలో ప్రశ్నిస్తామని హెచ్చరిం చారు.పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా ప్రోటోకాల్ పాటించడం లేదని, వార్డులలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో స్ధానిక వార్డు కౌన్సిలర్‌కు ఆహ్వానం అందేలా చూడాల్సిన భాధ్యత మున్సిపల్ కమిషనర్‌పై ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ప్రాతినిధ్య వహిస్తున్న వార్డులలో అభివద్ధి పధకాలకు నిధులు కేటాయించడం లేదని వారు అసంతప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రతి వార్డును సమాన ద్ర్రష్టితో చూస్తూ అభివద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.పట్టణంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు.ఎక్కడ చూసినా రోడ్లు తవ్వి వదిలివేయడంతో ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారని, పట్టణ అభివద్ధిలో ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను భాగస్వామ్యం చేయా లన్నారు.11వవార్డు రాయినిగూడెం ప్రభుత్వ పాఠశాల అభివద్ధికినిధులు కేటాయించాలని, హ్యాండ్‌పంప్ మట్టిలో కూరుకుపోయిందని, మరమ్మతులు చేపట్టాలని, పాఠశాల ఆవరణలో జిమ్‌సెంటర్ ఏర్పాటు చేయాలని,వార్డులో రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు.