Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మద్దిరాల :రైతురాజు కావాలనే లక్ష్యంతో రైతులకు పంట పెట్టుబడికి సహాయంగా రైతు బంధు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ అన్నారు.గురువారం మండలకేంద్రం లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో వివిధ గ్రామాల రైతు బంధు సమితి అధ్యక్షులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బుధవారం వరకు రైతులకు 314 కోట్ల రూపాయలను 1,43,570 మంది రైతుల ఖాతా లోకి జమ చేసినట్లు తెలిపారు. వారం రోజుల్లో అందరి రైతులకు రైతు బంధు అందు తుందన్నారు.రైతులకు బాంధవుడు అయిన కేసీఆర్కు రైతులు పాలా భిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులువైస్ యంపీపీ శ్రీరాంరెడ్డి, రైతు బంధు మండలకోఆర్డినేటర్ ఆకుల ఉప్పలయ్య,జిల్లా నాయకులు దుగ్యాల రవీందర్ రావు,కన్నా వీరన్న,తందారి ప్రతాప్ గౌడ్,వడ్డాణం మధు,పాతూరి లింగారెడ్డి, గుమ్మడవెళ్లి సర్పంచ్ వల్లపు యాకన్న యాదవ్, కొమరయ్య పాల్గొన్నారు.