Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
చేపల చెరువు నిర్మించుకోవడానికి స్థలం ఎంపిక మట్టి పరిశీలన ఎంతో ముఖ్యమైందని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ బి. లవకుమార్ అన్నారు.గురువారం కషివిజ్ఞానకేంద్రం మండలపరిధిలోని గడ్డిపల్లిలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక యువతకు జాతీయ మత్య్సఅభివద్ధి మండలి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారం, సెంటర్ ఫర్ ఇన్న్వ్ఱోషన్స్ ఇన్పబ్లిక్ సిస్ట మ్ హైదరాబాద్ వారి సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా 4వ రోజు చేపల చెరువు నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక కోసం మట్టినామునా సేకరణ, భూసార పరీక్ష విధానాల గురించి నెల్లూరుమత్య్స కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జె. జస్వంతి వివరించినట్టు తెలిపారు.నల్లరేగడి నేలలు, బంకమట్టి, కొద్దిగా ఇసుకతో కూడిన రేగడి నేలలు అనువుగా ఉంటాయన్నారు.చెరువు నిర్మాణానికి ముందుగానే మట్టి సేకరించి పరిశీలన చేసుకోవాలని, భూసారపరీక్షలకు అనుగుణంగా చెరువుల్లో సేంద్రియ రసాయనిక ఎరువుల మోతాదును లెక్క కట్టి చెరువులో నెలసరి మోతాదులో వాడు కోవాలన్నారు.తద్వారా పోషకాలు సమద్ధి గా అంది అధిక చేపల దిగుబడిని పొందొచ్చన్నారు.చెరువు నిర్మాణంలో తీసుకోవాల్సిన వివిధ అంశాలైన గట్టునిర్మాణం, చెరువులోతు, అడుగు, తూముల నిర్మాణం, చెరువుల ఆకారం, సీపేజ్ కెనాల్ మొదలగు వాటి గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో పుష్ప, సుప్రీత, హైమావతి, శైలజ, లక్ష్మి,ప్రశాంతి , రాంబాయి, నాగరాజు, రాజకుమార్ల, గురవయ్య,జానయ్య, మట్టయ్య, నరేందర్లతో పాటు 30 మంది పాల్గొన్నారు.