Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్లపై నూతన సంవత్సర వేడుకలు,కేక్ కటింగ్‌లు నిషేధం
ప్రజలు డిసెంబర్ 31 వేడుకల్లో పోలీసు సూచనలు పాటించాలి
ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ.. నూతన సంవత్సర వేడుకలను ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించుకోవాలని ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ కోరారు.రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనక నుగుణంగా డీజీపీ ఆదేశానుసారం జిల్లావ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.అందుకోసం ప్రజలు పోలీసు సూచనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా,మహిళలను కించపరచకుండా ప్రవర్తించాలని సూచించారు.కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో ర్యాలీలు, సభలను ప్రభుత్వం నిషేధించిందని, అందుకు ప్రభుత్వ నిభందనలను తప్పక అమలుచేస్తామని చెప్పారు.కరోనా వ్యాప్తి దష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎవ్వరూ గుంపులు గుంపులుగా తిరగవద్దని, సామూహిక కార్యక్రమాలు నిర్వహిం చవద్దని కోరారు.ఓమిక్రాన్ వైరస్, మూడోదశ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.144 సెక్షన్ ఆంక్షలు జనవరి 2వ తేది వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తేల్చిచెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పనిసరి
31 రాత్రి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ పోలీసు శాఖ నిర్వహిస్తోందని,అందుకు మద్యం తాగి ఎవరు రోడ్లపైకి రావద్దని ఎస్పీ సూచించారు.ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని,బహిరంగంగా మద్యం తాగవద్దని చెప్పారు.వేడుకల్లో అప శతులు జరగకుండా వాహన తనిఖీలు, బ్లూకోల్ట్స్ పెట్రోలింగ్, పెట్రోకార్ పెట్రోలింగ్, మఫ్టీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశామని, సీసీ కెమరాలు పర్యవేక్షణలో ఉంటాయని వెల్లడించారు. ఆర్కెస్ట్రా, డీజేలు, మైక్‌లు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దన్నారు. ఎవరైనా నిబం ధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సంధర్భంగా డిసెంబర్ 31 రోజున ఏ దుకాణ యజమానులు కూడా ఆహారపదార్ధాల విక్రయాల్లో వినియోగదారుల నుండి ఎక్కువగా ఎటువంటి అధిక వసూళ్లు చేయొద్దని హెచ్చరించారు.