Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డు కౌన్సిలర్ పోలోజు శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆ వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేయవద్దని సూచించారు. దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. చెత్త సేకరణ వాహనాల్లోనే చెత్తను వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి రేణుకుమార్, ఆర్పీలు పోలోజు జ్యోతి, గోపి వెంకటలక్ష్మీ, వార్డు ప్రజలు పాల్గొన్నారు