Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
సర్వమతాల సమ్మేళనం మదార్‌సాహెబ్ దర్గా అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన రామసముద్రం రోడ్డు వద్ద ఉన్న మదార్‌సాహెబ్ దర్గా ఉర్సును ఘనంగా నిర్వహించారు. ముందుగా కాటమయ్య నగర్ నుండి రామసముద్రం మధ్యలో బైపాస్ దగ్గర ఉన్న బీజని మధు అస్థాన హజ్రత్, సయ్యద్, బదియోద్దీన్, పీర్ జిందాషా మదార్ సాహెబ్ ఉర్సు ఉత్సవాలకు గంధం ఊరేగింపుగా తరలించారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి ,సూదగాని ఫౌండేషన్ చైర్మెన్ సుదగాని హరిశంకర్ గౌడ్ , మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య , టీఆర్ఎస్ మండల,పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, పుట్ట మల్లేష్ గౌడ్, కౌన్సిలర్లు బెతి రాములు, జూకంటి శ్రీకాంత్, రాయపురం నర్సింలు,దాసి సంతోష్, కుండే సంపత్,కుతాటి అంజన్ కుమార్ పాల్గొన్నారు.