Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఓ రైతు ధాన్యం డబ్బులను తీసుకొని, స్కూటీ లో పెట్టి షాప్‌కి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం పట్టణకేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ..మండలంలోని హనుమపురం గ్రామానికి చెందిన ఎర్ర బోయిన శ్రీశైలం ఇటీవలనే వరి ధాన్యాన్ని అమ్మాదాడు. ఎస్బీఐ బ్యాంకులో డబ్బులను డ్రా చేసుకున్న రూ.47వేలు తన స్కూటీ డిక్కీలో పెట్టి ముస్తఫా చికెన్ సెంటర్ పక్కన వ్యవసాయ బావి వద్ద గల గేదెలకు పగ్గాలు కొనడానికి వెళ్లాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి స్కూటీ తెరిచి రూ.47 వేల ను ఎత్తుకెళ్లారు. సదరు రైతు వచ్చిచూడగా డబ్బులు కనిపించకపోవడంతో వెంటనే ఈ విషయాన్ని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వారు సీసీ కెమెరా లను నిందితులను పట్టుకోవడానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.