Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భూదాన్ పోచంపల్లికి బెస్ట్ టూరిజం అవార్డుకు ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎంపిక కాగా భారత టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోచంపల్లిలో ఈ నెల25న బాలాజి ఫంక్షన్ హాల్లో సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ యూత్ అవార్డులకు స్వతంత్య్ర సమర యోదులకు, సీనియర్ సిటిజన్స్‌కు,వివర్స్తో పాటు అనేక మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. 10కెరన్,సైక్లింగ్, ఎగ్జిబిషన్ వంటి ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సింహా, జిల్లా విద్యాధి కారి, వెంకట్ రెడ్డి, అస్సిస్టెంట్ కమిషనర్, సుధర్శన్, మునిసిపల్ కమిషనర్, పోచంపల్లి, కె.ధనుంజనేయులు, జిల్లా టూరిజం అధికారి పాల్గొన్నారు.