Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
వలిగొండ మండల కేంద్ర మేజర్ గ్రామ పంచాయతీలో జిల్లా అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహించిన మడిగెల వేలం పై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని డీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మాట్లాడుతూ వలిగొండ గ్రామపంచాయతీ మడి గెల వేలం మార్చి నుండి మార్చి వరకు వేయాల్సి ఉండగా తేదీ-15-11-2021 రోజున జిల్లా అధికారుల అనుమతులు లేకుండానే మధ్యంతరంగా వేలం వేశారని తెలిపారు. వేలం వేయడానికి 5 రోజుల ముందే 10-11-2021రోజున జిల్లా పంచాయతీ అధికారి డీపీఓ కి ఫిర్యాదు చేశామని పిర్యాదు చేసి 50 రోజులు దాటినా నేటికీ పట్టించుకోలేదన్నారు. అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని పై అధికారులకు విన్నవించినా తమకు పట్టనట్టుగా వ్యవహరించడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు గ్రామపంచాయతీ మడిగెల వేలం విషయంలో గత పాత బకాయిలు వసూలు చేయకుండా పాత మడిగెదారులను ఖాళీ చేయాలని ఇబ్బందులు పెట్టడంతో వారు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.దీని ద్వారా గ్రామపంచాయతీ రూ. 20లక్షల ఆదాయాం కోల్పోయిందన్నారు. ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ తప్పుడు పత్రాలను సష్టించాడన్నారు 2018 యాదగిరిగుట్ట పేరుతో జీవోను ఆధారంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించడన్నారు. మడిగెల వేలం కోసం సేకరించిన డిపాజిట్లను (50,000 ఒక్కోక్కరి దగ్గర ) ఎస్టీవో లో జమ చేయకుండా నిధులను దుర్వినియోగం చేసారని తెలిపారు. వెంటనే ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించిన పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలనిడిమాండ్ చేశారు. 5వ తేదీ వరకు విచారణ జరిపించని పక్షంలో డీపీఓ కార్యాలయం ముందు రిలే దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా డీపీఓ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో వినతి పత్రాన్ని కార్యాలయం డోరుకు అంటించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు దయ్యాల నర్సింహా,మాయ కష్ణ,గడ్డం వెంకటేష్, వనం రాజు,వలిగొండ మండల కార్యదర్శివర్గ సభ్యులు కూర శ్రీనివాస్,కల్కురి రామచందర్,పట్టణ కార్యదర్శి గర్దాసు నర్సింహా, మండల నాయకులు కవిడే సురేష్ ,బీమనబోయిన జంగయ్య,నాయకులు ధ్యానబోయిన యాదగిరి,బండమీది సుందరయ్య,వేముల లక్ష్మయ్య,వేముల జైపాల్, నాగరాజు,జ్యోతిబాబు,గండికోట నర్సింహా,పిట్టల అంజయ్య,వడ్డేబోయిన వెంకటేష్,మల్లేశం పాల్గొన్నారు.