Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేటీిఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి
అ రామగిరి, క్లాక్‌టవర్ చౌరస్తా.. లతీఫ్సాబ్ గుట్ట
సీనియర్ సీటిజన్, దుకాణ యాజమానులతో ముచ్చట్లు
అ మహిళ యాచకులకు ఉపాధి కల్పించాలని ఆదేశాలు
అ ముందస్తుగా ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టు
అ మంత్రుల కాన్వారును అడ్డుకున్న నిరుద్యోగులు
అ సభలకు అంగన్వాడీ టీచర్లా
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ పట్టణంలో అభివృధ్ది పనులకు శంకుస్థాపనకు విచ్చేసిన ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలకు జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం లభించింది. అందులో భాగంగానే ఎంజీ యూనివర్సీటీ వద్ద టీఆర్ఎస్ నాయకులు సుమారు 500బైకులతో స్వాగతం పలికారు. ఓపెన్‌టాప్ వాహనంపై ర్యాలీ అన్నెపర్తి, చర్లపల్లి, మర్రిగూడ బైపాస్ మీదుగా పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనానికి ప్రారంబోత్సవం చేశారు. అనంతరం అదే ప్రాంగంలో రూ.110కోట్లతో ఏర్పాటు చేయబోయే ఐటి హాబ్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులంతా ప్రసంగించారు.
సమీకృత మార్కెట్‌కు స్థల పరిశీలన
సభ అనంతరం నాగార్జున కాలనీలో వ్యవసాయ మార్కెట్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడే నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రెటేడ్ సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అటునుంచి నేరుగా రామగిరి క్లాక్ టవర్ చౌరస్తాకు చేరుకున్నాను అక్కడ నుంచి నెహ్రు విగ్రహం దిమ్మె పై ఎక్కి అక్కడ సర్కిల్ జంక్షన్, వాటర్ ఫౌంటేషన్, ల్యాండ్ స్కెపింగ్ ల నిర్మాణం గురించి కలెక్టర్, మున్సిపల్ అధికారులతో చర్చించారు. స్థలాన్ని పరిశీలించారు. క్లాక్ టవర్ చౌరస్తాలోనే సినియర్ సీటిజన్స్ దుకాణాల యాజమానులతో మంత్రులు మాట్లాడారు. అంతేగాకుండా డీఈవో కార్యాలయం ముందు ఉన్న ప్రాంతాన్ని కూడామంత్రులు పరిశీలించారు.
మహిళ యాచకులతో మాట్లాడిన కేేటీఆర్
క్లాక్ టవర్‌లో మంత్రుల బృందం పాదయాత్ర చేస్తుండగా అక్కడే మహిళలు యాచకులు కనిపించగా వారితో మాట్లాడారు. యాచకులుగా మారడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు ఆదేశాలు జారీచేశారు.
బస్తీదవాఖానా ఏర్పాటుకు స్థల పరిశీలన
జైల్‌ఖానా కాలనీ వద్ద పాదయాత్ర చేసి అక్కడ ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానా, రైతు బజార్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఆ కాలనీ పరిస్థితులను కూడ అడిగి తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర లో మంత్రులతో పాటుగా స్థానిక ఎమ్మేల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటివలే ఎమ్మెల్యే తండ్రి గాదరి మారయ్య ఆనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్షాల ముందస్తు అరెస్టులు
జిల్లా కేంద్రంలో ముగ్గురు మంత్రుల పర్యటనను పురస్కరించుకుని ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పట్టణంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను గురువారం అర్థరాత్రి నుంచే అరెస్టు చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత, భిజెపి నాయకులను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పట్టణంలోకి వస్తున్న మంత్రుల కాన్వారును వివేకానంద విగ్రహం వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగానే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరుద్యోగులను కాలిబూట్లతో తన్నారు.
మంత్రుల సభకు అంగన్వాడీ టీచర్లా
జిల్లా కేంద్రంలో జరిగిన ప్రభుత్వ అధికారిక సభ పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు కూడా వచ్చారు. వాస్తవంగా సభకు టీచర్లు రావాల్సిన అవసరం లేదు. కానీ టీచర్లకు ఐసీడీఎస్ అధికారుల ఆదేశాల మేరకే ఈ సభకు వచ్చామని టీచర్లు పేర్కొంటున్నారు. బిఎల్వో, కరోనా వ్యాక్సిన్ అందజేత పేరుతో విధులకు డుమ్మా కొట్టిస్తున్నారు. ఇపుడు ప్రభుత్వ సభల పేరుతో డుమ్మా కొట్టించారు. ఒకవేళ ఎవరైనా సభకు రానంటే ఇక వారిపై వేదింపులుంటాయని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సభకు అంగన్ వాడీ టీచర్లకు ఏం సంబంధముందో వారికే అర్థం కావడంలేదు.