Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మండలపరిధిలోని జైకేసారం గ్రామానికి చెందిన రైతు రాగీరు కష్ణయ్య వడ్లను తూకం వేయాలని కోరుతూ శుక్రవారం రైతుసంఘం మండల అధ్యక్షులు చీరిక సంజీవరెడ్డి, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి గంగదేవి సైదులు ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జైకేసారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీంతో రైతు కష్ణయ్య ఒక బస్తాకు ట్రాన్స్ పోర్టు ఛార్జీ రూ.2తోపాటు రశీదు ఇవ్వాలని అడగడం వల్ల రశీదు అడిగితే వడ్లు కొనేది లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. రవాణా ఛార్జీలు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్లు కొనుగోలు చేయాలని కోరారు. వినతితపత్రం అందజేసిన వారిలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు రొడ్డ అంజయ్య, నాయకులు ఎమ్‌డి.పాషా, బండారు నర్సింహా ఉన్నారు.