Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని సర్వేనెంబర్ 322లో గల నాగులకుంటను పార్కుగా మార్చాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో సింగిల్‌విండో చైర్మెన్ చింతల దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగులకుంట చుట్టుపక్కల కాలనీ ప్రజలు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని హనుమాన్‌నగర్, రత్ననగర్, బంగారిగడ్డ కాలనీల్లోని ప్రజలు నాగులకుంటలోని మరుగునీటితో కాలుష్యం నీరు నిండి విపరీతమైన దోమలతో అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దాతల నుండి సేకరించిన నిధులతో నాగులకుంటను పార్కుగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యజ్ఞమాచారి, సారయ్య, మల్లిఖార్జున్‌రెడ్డి, సమ్మయ్య, రాజుచారి, స్వామి, రోషయ్య, సాయి, లింగస్వామి, దయాకరచారి, రాంరెడ్డి పాల్గొన్నారు.