Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
గత ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ,మండల కార్యదర్శుల సంయుక్త సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ నల్లచట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా ఢల్లీీలో రైతులు చేసిన పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రద్దు చేసిందని గుర్తు చేశారు.అలాగే పంటలకు మద్దతుధరల బిల్లును పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు.యాసంగిలో వేసిన వరిపంటను కూడా కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌చార్జీలను పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.విద్యుత్‌చార్జీలను పెంచితే గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో టీఆర్ఎస్కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.యాసంగిలో ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేసేవరకు కొనుగోలుకేంద్రాలు పెట్టాలని, లేనిపక్షంలో ప్రభుత్వాన్ని తూర్పార పట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తామర తెగుళ్ళతో మిర్చి పంట నష్టపోతుంటే ప్రభుత్వం ఆ రైతులను ఓదార్చడం లేదని,ఉద్యానవన అధికారులు పరీక్షలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఉద్యానవన అధికారులు వెంటనే నష్టపోయిన మిర్చిపంటను అంచనా వేసి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.రబీలో కూడా వేసిన పంటలను కాపాడడానికి సాగర్ ఎడమ కాలువకు,ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు.ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సర్వేలు చేసి పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాల అమలుకు నిధులు కేటాయించాలని కోరారు. ఎస్సెల్బీసీ సొరంగానికి నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.వివిధ పట్ట ణాలలో మండల కేంద్రాలకున్న లింకు రోడ్ల మర మ్మతులకు నిధులు కేటాయించాలన్నారు. ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఇస్తామన్న రూ.5 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్,పాలడుగు నాగార్జున, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, కందాల ప్రమీల, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, పి.ప్రభావతి, చినపాకలక్ష్మీనారాయణ, సయ్యద్‌హాషం పాల్గొన్నారు.