Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే మాదిగ విద్యార్థి గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు ఫిబ్రవరి 12న చలో హైదరాబాద్ మాదిగ విద్యార్థుల గర్జన మహాసభను జయప్రదం చేయడం కోసం శుక్రవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విద్యార్థి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా మాదిగ విద్యార్థుల గర్జన మహాసభకు ఉమ్మడి ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధ్యక్షుడు రేవూరి శివాజీ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇన్చార్జి బుషిపాక గణేష్ , ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకుడు బొజ్జ సైదులు మాదిగ , చేకూరి గణేష్ , బోడ సునీల్ , నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్ ముదిగొండ వెంకటేశ్వర్లు , నాయకులు పరంగి రవి , యూనివర్సిటీ విద్యార్థులు శ్రీ రాజ్ , సునీల్ , ప్రకాష్, యూనివర్సిటీ అధ్యాపక బందం మద్దిలేటి , శ్యామ్, ప్రేమ్ తిరుపతయ్య, అభిలాష, విజరు, సాగర్, మరియు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.