Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిశోర్‌కుమార్ తండ్రి గాదరి మారయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జిల్లా కేంద్రంలో అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి వారిని కలిశారు. మారయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, ,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ , ఎమ్మెల్సీ కంచెనపల్లి రవీంద్రరావు, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, సైదిరెడ్డి ,భాస్కర్ రావు, నోముల భగత్ ,మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి,సైదిరెడ్డి, భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్‌కుమార్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మండలి సైదిరెడ్డి పాల్గొన్నారు.