Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంజీయూ ఉపకులపతి గోపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ప్రభుత్వ అనుమతితో 2022వ సంవత్సరంలో పలు అభివద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు వీసీ సీహెచ్. గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జనవరిలో కాన్వకేషన్ నిర్వహించడంతో కార్యక్రమాలు మొదలవుతాయని, అదేవిధంగా విశ్వవిద్యాలయం న్యాక్ అక్రిడిటేషన్ కోసం వెళ్లనున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించిన పరీక్షల భవనములో తగిన ఏర్పాట్లను చేసి ప్రారంభించనున్నట్లు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం లైబ్రరీలో ఉన్న సదుపాయాలతో పాటు డిజిటల్ లైబ్రరీ గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న ఇంజినీరింగ్ కళాశాల బాలుర హాస్టల్లో కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. పీజీ స్థాయిలో లైబ్రరీ సైన్స్ కోర్సులను ప్రారంభిస్తామని అన్నారు.