Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ చౌరస్తాలో నడిరోడ్డు మీద ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని వెంటనే తొలగించాలని కోరుతూ ఆ ప్రాంతవాసులు మున్సిపల్ కమిషనర్ గోపయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు వజ్రపు రామయ్య ఇంటి దగ్గర నుండి శ్రీ సరస్వతి శిశు మందిర్ ముందుగా వెళ్లే రోడ్డు ఒకటి 50 ఫీట్ల రోడ్డు మరోపక్క పంచాయతీ రోడ్డు మున్సిపాలిటీ నుండి సెంటర్‌కు వచ్చేది ఉండడంతో ప్రజలంతా పంచాయతీ రోడ్డు నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారు.శ్రీ సరస్వతి శిశు మందిర్ నిర్మాణం పక్కన ఎన్నెస్పీ కాలువ ఉండడంతో అక్కడ కొంతభాగం వాడుకలో లేదన్నారు.దీనిని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు తప్పుడు పత్రాలు సష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు.అక్కడ ప్రజలు నిర్మాణం చేయొద్దని వ్యతిరేకిస్తే బెదిరింపులకు దిగుతున్నారన్నారు.రాత్రికి రాత్రే ప్రభుత్వ బోరింగ్ మాయం చేశారన్నారు.ఆ ప్రాంత ప్రజలు నీళ్ళకు పడుతున్న ఇబ్బందులు గమనించి అప్పటి సర్పంచ్ కొనతం వెంకట్‌రెడ్డి బోరింగ్‌ను ఏర్పాటు చేశారన్నారన్నారు.సీఎం కేసీఆర్ మున్సిపల్ అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించారన్నారు.ఈ రోడ్డు గుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయుటకు ప్రతిపాదన సైతం పంపారన్నారు.ఈ అక్రమ తీర్మానాన్ని కూల్చి వేస్తే తప్ప ఈ రోడ్డు నుండి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం అసాధ్యమన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో రాచకొండ చంద్రశేఖర్, మెట్టు వేణుగోపాల్‌రెడ్డి, బట్టు మధు, రామచంద్రయ్య, చామకూరి చిన్నవీరయ్య, వాసపల్లయ్య, ఇంజమూరి రాజేష్, రాపోలు నవీన్,మళ్ళికంటి సత్యనారాయణ, యూసఫ్, ఇంజమూరి శ్రీనివాస్, వాసా కర్నాకర్, నాగార్జున ఉన్నారు.